News November 20, 2024
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News January 2, 2026
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News January 1, 2026
మార్కాపురానికి CM రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News January 1, 2026
మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?