News March 27, 2025
అచ్చంపేట: ఈనెల 29న పశువులు, మేకలు, గొర్రెల సంతకు వేలం పాట

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న 2025 -26 పశువులు, మేకలు, గొర్రెల సంత వేలంపాట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈనెల 29 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ యాదయ్య, ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. రూ10 లక్షల నగదు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని వారు సూచించారు. రూ.15 వేల తిరిగిరాని రుణంతో దరఖాస్తు చేసుకోవాలని పాల్గొనేవారిని కోరారు.
Similar News
News January 11, 2026
నందిగామలో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా!

నందిగామ మండలం మునగచర్లలో సోమవారం జరగాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మార్పును కార్యకర్తలు, అభిమానులు గమనించి సహకరించాలన్నారు.
News January 11, 2026
HYD: ఆ నలుగురు లేకపోయినా!

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.
News January 11, 2026
2.9°Cకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో 4.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. అటు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9°C ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


