News April 4, 2025
అచ్చంపేట: ఈయన చనిపోయాడు.. గుర్తుపడితే చెప్పండి..!

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ గుర్తుతెలియన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రయాణికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే అచ్చంపేట పోలీసుల నంబర్ 8712657733కు ఫోన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News December 4, 2025
ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.
News December 4, 2025
కదిరి యువతికి రూ.45 లక్షల జీతం

కదిరి పట్టణానికి చెందిన విద్యార్థి శ్రీ జన్యరెడ్డి భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమె క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బెంగళూరుకు చెందిన NAVI అనే సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.45 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి, స్వర్ణలత తెలిపారు. పలువురు శ్రీ జన్య రెడ్డిని అభినందించారు.
News December 4, 2025
చింతకాని: ఓటు వేసేందుకు కెనడా నుంచి వచ్చిన యువకుడు

చింతకాని మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కెనడా నుంచి వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో సర్పంచిగా పోటీ చేస్తున్న తన తల్లి లక్ష్మీ కాంతమ్మకు ఓటు వేసేందుకు వచ్చినట్లు వారు చెప్పారు. సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేసి అత్యవసరంగా విమాన టికెట్ బుక్ చేసినట్లు పేర్కొన్నారు.


