News August 11, 2024
అచ్చంపేట: ఉమామహేశ్వర ఆలయ ప్రత్యేకత!

నల్లమల అటవీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుంచి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.
Similar News
News October 31, 2025
బాదేపల్లి మార్కెట్లో పంట ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం మొక్కజొన్న 2,695 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,007, కనిష్ఠ ధర రూ.1,600 పలికింది. ఆర్ఎన్ఆర్ వడ్లు 130 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.2,089, కనిష్ఠ ధర రూ.1,739గా నమోదైంది. జొన్నలు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,701, రాగులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.3,777 లభించాయి.
News October 31, 2025
MBNR: U-17 రగ్బీ.. NOV 3న ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. మహబూబ్ నగర్లోని స్టేడియం గ్రౌండ్లో నవంబర్ 3న అండర్-17 విభాగంలో బాల, బాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తి గల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు.
News October 31, 2025
రాజాపూర్: బీసీలంతా ఏకం కావాలి: తీన్మార్ మల్లన్న

బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్లో ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్, బీసీ నాయకులు పాల్గొన్నారు.


