News March 29, 2024

అచ్చంపేట: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

అచ్చంపేట మండలంలోని దుబ్బా తండాకు చేందిన కేతవత్ జవహర్(33) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సిద్దాపూర్ SI పవన్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాలు.. గురువారం తన వ్యవసాయ పొలంలో స్థభానికి జవహర్ ఊరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో పొలానికి వెళ్లి జవహర్ సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు. 

Similar News

News February 12, 2026

MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

image

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.