News April 16, 2025
అచ్చంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మార్చిరీలో శవం

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో గత కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని అచ్చంపేట హాస్పిటల్‌కి గ్రామస్థులు తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈయనను గుర్తుపట్టినవారు ఈగల పెంట పీఎస్, 8712657739, 8712657741, 9000901668 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 7, 2025
పూజకు ఏయే రత్నాలను ఉపయోగించాలి..?

‘సువర్ణ రజతం ముక్తా; రాజవర్తం ప్రవాలకం రత్న పంచక మాఖ్యాతం’ అంటే.. బంగారం, వెండి, ముత్యం, వజ్రపు శిల(రాజవర్తం), పగడం(ప్రవాలకం)లను పంచ రత్నాలుగా పరిగణించాలి. ఒకవేళ ఈ ఐదు రత్నాలు దొరకనట్లయితే ‘ఆభావే సర్వ రత్నానాం హేమ సర్వత్ర యోజయేత్’ అన్నట్లు.. వాటి స్థానంలో బంగారాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. అన్ని రత్నాలలోనూ ఉత్తమమైనది. సమస్త కార్యాలకు వినియోగించడానికి అర్హమైనది. అందుకే పసిడికంత ప్రాధాన్యం. <<-se>>#Pooja<<>>
News November 7, 2025
ASPగా నంద్యాల జిల్లా యువతి

మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి మన్యం జిల్లా పార్వతీపురం ఏఎస్పీగా గురువారం బాధ్యతలు చేపట్టారు. గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్‌గా ఉన్న మనీషా రెడ్డిని ఇటీవల ఉన్నతాధికారులు పార్వతీపురం ఏఎస్పీగా నియమించారు. ఈ మేరకు తల్లిదండ్రులు పార్వతీపురం చేరుకుని తమ కుమార్తెను అభినందించారు. గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు స్వల్ప అవకాశముందని HYD IMD పేర్కొంది. తర్వాతి 6 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.


