News February 14, 2025
అచ్చంపేట: గ్రామాలలో కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి: DRDO

అచ్చంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, ఉప్పునుంతల, పదర మండలాల ఉపాధి హామీ సిబ్బందికి రివ్యూ సమావేశం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేష్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు మొదలుపెట్టి గ్రామానికి 50 మంది కూలీలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఏపీవోలు,ఈసీలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2025
మెదక్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేడు హవేలి ఘనపూర్‌లోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు.
News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.
News March 20, 2025
ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదు

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. గురువారం ఎస్‌ఐ విశ్వనాధ్ వివరాల మేరకు.. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీలో నివావసముంటున్న చందు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.