News March 13, 2025
అచ్చంపేట డిపోకు 10 మహిళా శక్తి బస్సులు కేటాయింపు

మహిళలను ఆర్థికంగా ఎదిగించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో బస్సులను కేటాయించింది. నల్లమల ప్రాంతం నియోజకవర్గంలో అధికంగా మారుమూల పల్లెలు, గిరిజన తండాలు ఉండడంతో అచ్చంపేట డిపోకు 10 బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ మురళీ దుర్గాప్రసాద్ తెలిపారు. వీటి నిర్వహణ త్వరలో మహిళా సంఘాలు నిర్వహించనున్నారు.
Similar News
News December 6, 2025
రేపు డయాలసిస్ కేంద్రాలకు భూమిపూజ: కేంద్రమంత్రి వర్మ

భీమవరం, ఆచంటలో రేపు డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.10కోట్ల CSR నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News December 6, 2025
సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం: కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని పేర్కొన్నారు.
News December 6, 2025
NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

యూడైస్ ప్లస్ పోర్టల్‌లో SSC నామినల్ రోల్ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్‌రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్‌ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్ ప్లస్‌లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్‌ఈ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని స్పష్టం చేశారు.


