News March 13, 2025

అచ్చంపేట డిపోకు 10 మహిళా శక్తి బస్సులు కేటాయింపు

image

మహిళలను ఆర్థికంగా ఎదిగించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో బస్సులను కేటాయించింది. నల్లమల ప్రాంతం నియోజకవర్గంలో అధికంగా మారుమూల పల్లెలు, గిరిజన తండాలు ఉండడంతో అచ్చంపేట డిపోకు 10 బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ మురళీ దుర్గాప్రసాద్ తెలిపారు. వీటి నిర్వహణ త్వరలో మహిళా సంఘాలు నిర్వహించనున్నారు.

Similar News

News April 10, 2026

జనగామ నేతలతో TPCC చీఫ్ సమావేశం

image

గాంధీభవన్‌లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీల నియామక ప్రక్రియ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు మహేశ్ కుమార్ గౌడ్ దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2026

50 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది: HNK ఎస్ఈ

image

గడిచిన త్రైమాసికంలో జిల్లాలో సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలు కలిపి జిల్లాలో మిలియన్ యూనిట్ల వారిగా జనవరి మాసంలో 139.120, ఫిబ్రవరిలో 147.860, మార్చిలో 189.050 రికార్డు నమోదయింది. వేసవిలో వినియోగదారుల డిమాండ్ మేరకు ఎలాంటి అంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు.

News April 10, 2026

RCB Vs RR.. టాస్ ఆలస్యం

image

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.