News April 14, 2025
అచ్చంపేట: నల్లమలలోని ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు

నల్లమల ప్రాంతంలోని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. భక్తుల సంఖ్య, ఆదాయం పెరగడంతో మద్దిమడుగు ఉమామహేశ్వరం, సోమశిల, నాయనపల్లి మైసమ్మ, 6ఏ జాబితాలో చేర్చుతూ హోదా పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పాలెం వెంకటేశ్వర దేవాలయానికి 6బీ జాబితాలో చేర్చారు.
Similar News
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.
News March 5, 2026
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News March 5, 2026
ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధ్యక్షతన క్లినిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2010 ప్రకారం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని,ఫైర్ ఎక్స్టెన్షర్ గ్యాస్ వాలిడిటీ పూర్తయిన తర్వాతే ఫిల్లింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.11 ఫెసిలిటీస్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతులు పొందాయి. DCP రామ్ రెడ్డి,ACP రమేష్,డా. కె.ప్రమోద్ కుమార్,డా. ప్రణీత్ పాల్గొన్నారు.


