News March 22, 2025
అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
Similar News
News November 27, 2025
చిత్తూరు: మహిళా ఉద్యోగులకు తప్పని వేధింపులు.!

చిత్తూరులో జిల్లాలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై విలేకరుల మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. వనదుర్గాపురానికి చెందిన ఆర్మీ ఉద్యోగి నవీన్ నాయుడు, విలేకరి శరవణ, HRC సభ్యుడు గురు ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తనను చిత్రవధ చేస్తున్నారని ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. 5 నెలలుగా వేధిస్తుండగా భర్త అనుమానంతో దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 27, 2025
ADB: సం’గ్రామం’ షురూ.. మొదలైన ఎన్నికల సందడి

గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందే పల్లెల్లో సందడి మొదలైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోరు మరింత జోరందుకుంది. బీసీలకు కొంతమేర స్థానాలు తగ్గినప్పటికీ.. కొన్ని జనరల్ కేటగిరీ రావడంతో ఏదేమైనా పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కులాల వారీగా అంచనాలు వేసుకుని ఏం చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారు. ఉమ్మడి ADBలో 1,514 పంచాయతీల్లో ఈసారి పోరు రసవత్తరంగా ఉండనుంది.
News November 27, 2025
ఆ రహదారిపై ప్రమాదాలు ఎక్కువ: బాపట్ల ఎస్పీ

రోడ్డు ప్రమాదాల వలన సంభవించే మరణాల వలన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎస్పీ ఉమామహేశ్వర్ బుధవారం తెలిపారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్అండ్బీ, హైవే అధికారులు సంయుక్త కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిధిలో ప్రధానంగా నామ్ హైవే, హైవే నంబర్ 16, 216లపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.


