News March 22, 2025

అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

image

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్‌ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

Similar News

News April 21, 2025

వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

image

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

News April 21, 2025

శ్రీకాళహస్తి: జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

image

శ్రీ కాళహస్తికి చెందిన జైన్ సునీల్ జైన్ ప్రథమ కుమార్తె కాషిష్ జైన్ 17 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెను సత్కరించారు. వచ్చే నెల 3న నాశిక్‌లో తమ గురువులు మహాసతి, ప్రమోద్ ముని మారా సాహెబ్ ద్వారా ఆమె సన్యాసిగా మారనున్నట్లు తెలిపారు.

News April 21, 2025

కడప: తాగిన మైకంలో గొంతు కోసుకున్న యువకుడు

image

కడపలో ఇమ్రాన్ మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇమ్రాన్‌కు తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతను బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!