News February 2, 2025
అచ్చంపేట: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు

నాగర్కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 3, 2025
NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.
News December 3, 2025
42 రోజులు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 42 రోజుల పాటు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ అశోక్, అధికారులతో కలిసి ఆయన సైబర్ నేరాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 3, 2025
అనంతగిరి కొండల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులను కొండపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించే అభివృద్ధి చేయాలన్నారు.


