News February 21, 2025

అచ్చంపేట మార్కెట్‌కు భారీ ఆదాయం

image

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు సాగుచేసిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. 7741 రైతుల నుంచి 2లక్షల11వేల834 క్వింటాళ్ల పత్తిని 3 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ వారు కొనుగోలు చేశారు. 1% శాతం మార్కెట్ ఫీజు ఆధారంగా ఒక రూ.1,55,34,554 మార్కెట్‌కు ఆదాయం వచ్చినట్లు కార్యదర్శి నరసింహులు వెల్లడించారు.

Similar News

News December 1, 2025

సంగారెడ్డి: జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

image

అండర్-19 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సంగారెడ్డిలోని జూనియర్ కళాశాల విద్యార్థి లెవిన్ మానిత్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన లెవెన్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

News December 1, 2025

గణనీయంగా తగ్గిన HIV-AIDS కేసులు

image

భారత్‌లో 2010-2024 మధ్య HIV- ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్షిక కొత్త కేసుల నమోదులో 48.7% క్షీణత నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4%, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ సైతం 74.6% తగ్గినట్లు వివరించింది. అటు 2020-21లో 4.13కోట్ల ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2024-25కు ఆ సంఖ్య 6.62కోట్లకు పెంచినట్లు పేర్కొంది.
– నేడు వరల్డ్ ఎయిడ్స్ డే.

News December 1, 2025

డిసెంబర్ నెలలో పర్వదినాలు

image

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి