News June 12, 2024

అచ్చంపేట మున్సిపాలిటీని కోల్పోయిన BRS

image

అచ్చంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ నరసింహ గౌడ్ పై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన తన పదవిని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది. కాగా త్వరలో కొత్త ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

Similar News

News March 18, 2025

జడ్చర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఫినాయిల్ తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కి చెందిన పెంటయ్య(62) ఆదివారం ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదైంది.

News March 18, 2025

MBNR: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై<<15788272>> ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NGKL జిల్లా బిజినేపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(76) MBNRలో నివాసముంటున్నారు. ఆయన కూతురు శ్వేత(45), ఈమె కొడుకు నిదయ్‌రెడ్డి(22)లు HYDలో ఉంటున్నారు. వీరు ముగ్గురు కారులో HYD నుంచి జడ్చర్లకు వస్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.

News March 18, 2025

NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!