News March 27, 2025
అచ్చంపేట: రంజాన్ తోఫా వెనక్కి తీసుకోండి: INTUC

భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలను వ్యతిరేకిస్తూ, రంజాన్ తోఫా ప్రకటించడం విడ్డూరమని అచ్చంపేట INTUC తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ, విద్యా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 18, 2025
కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.

కామారెడ్డి: ‘గణిత అధ్యాపకుడి కోసం దరఖాస్తు చేసుకోండి’

బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపాదికన గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అధ్యాపకుడికి రూ.23,400 వేతనం ఇస్తామని, అభ్యర్థులు MSC MATH B.ED/M.ED చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.