News March 27, 2025
అచ్చంపేట: రంజాన్ తోఫా వెనక్కి తీసుకోండి: INTUC

భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలను వ్యతిరేకిస్తూ, రంజాన్ తోఫా ప్రకటించడం విడ్డూరమని అచ్చంపేట INTUC తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ, విద్యా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
Similar News
News July 9, 2025
నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News July 9, 2025
YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.
News July 9, 2025
శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.