News April 24, 2024

అచ్చంపేట: రూ.6.16 లక్షల విరాళాలు పక్కదారి

image

ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం ఉమామహేశ్వరంలో అన్నదానం విరాళాలు పక్కదారి పట్టాయి. రూ.6.16 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ఉద్యోగి శంకర్ ఉపయోగించుకున్నారు. విరాళాలు పక్కదారి పట్టినట్టు గుర్తించామని, పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News April 25, 2025

MBNR: బిల్డింగ్‌పై మృతదేహం కలకలం..!

image

ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన MBNRజిల్లా అడ్డాకులలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి షేక్‌బాలీ కుమారుడు ముస్తాక్(37) మద్యానికి బానిసై ఇంటికి రాకుండా కొన్నాళ్లుగా నిర్మాణంలోని ఓ బిల్డింగ్‌పై పడుకుంటున్నాడు. గురువారం ఓ కుక్క మనిషి చేతిని నోట కరుచుకుని రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు చూసి పోలీసులకు చెప్పారు. వారొచ్చి బిల్డింగ్‌పై చూడగా ముస్తాక్ శవం కుళ్లిపోయి కనిపించింది.

News April 25, 2025

‘MBNR జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి’

image

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.

News April 24, 2025

MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

image

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.

error: Content is protected !!