News March 29, 2025

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు వారంతపు సెలవు, ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం ప్రభుత్వ సెలవులు ఉన్నట్లు తెలిపారు. రైతులు సెలవు రోజుల్లో ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 13, 2025

GWL: CPR పై అవగాహన కలిగి ఉండాలి- కలెక్టర్ సంతోష్

image

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారని చెప్పారు. ఈనెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News October 13, 2025

గద్వాల ప్రజావాణిలో 72 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి 72 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.

News October 13, 2025

గద్వాల్: నిందితులను రిమాండ్ చేయాలి

image

గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక మరణంపై ఉన్న అనుమానాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, నిందితులను త్వరగా రిమాండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు జిల్లా ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ​ప్రియాంక (అనుమానిత మరణం) కారణమైన వారిని వెంటనే రిమాండ్‌కు పంపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని వారు ఎస్పీని కోరారు.