News April 22, 2025
అచ్చంపేట: స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

పట్టణానికి చెందిన పిట్టల దశరథం, జ్యోతిల కుమార్తె పిట్టల స్నేహిత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులతో.. స్టేట్ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్నేహిత భవిష్యత్‌లో ఇంజినీర్‌గా ఎదగాలి అనేది తన కోరిక అని తెలిపింది. ఆమెను కాలేజీ సిబ్బంది అభినందించారు.
Similar News
News April 23, 2025
HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.
News April 23, 2025
VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News April 23, 2025
ఉగ్రదాడి.. ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు మృతదేహాలు

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి చేరినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు (నేపాల్, UAE) ఉన్నట్లు తెలిపారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నిన్న ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.