News April 24, 2024
అచ్చెన్నాయుడి ఆస్తుల వివరాలివే..

టెక్కలి అసెంబ్లి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలను సోమవారం నామినేషన్ నేపథ్యంలో అఫిడవిట్లో పొందుపరిచారు. స్థిరాస్తులు: రూ.2,31,48,500 ఉండగా, చరాస్తులు: రూ. 1,32,05,511 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు: రూ.42,90,153, చేతిలో నగదు: రూ. 2,50,000, వివిధ బ్యాంకుల్లో: రూ.64,18,869 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
Similar News
News November 13, 2025
ప్రభుత్వ చౌక ధరల డిపోలను తనిఖీ చేసిన రాష్ట్ర కమిషనర్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రోణంకి గోవిందరావు బుధవారం సోంపేటలో ఉన్న ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు సరుకులు ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా సరఫరా చేయాలని ఆదేశించారు. పంపిణీ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన, అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం బారువాలో ఉన్న డిపోలను పరిశీలించారు. పంపిణీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News November 12, 2025
హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.


