News April 4, 2025
అచ్యుతాపురంలో రోడ్డు ప్రమాదం.. ఫార్మా ఉద్యోగి మృతి

అచ్యుతాపురంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్వీఆర్ డ్రగ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి బగాది రమణారావు దుర్మరణం చెందాడు. బైక్‌పై విధులకు వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం తగిన పరిహారం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 24, 2025
సిద్దిపేటలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు సేఫేనా..?

కర్నూల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులు సేఫేనా అన్న ప్రశ్న ప్రజల ఆలోచనల్లో మెదులుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. ప్రమాదంపై విచారణ జరపాలని ఆదేశించారు. సిద్దిపేట ప్రైవేట్, స్కూల్ బస్సులపై ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంటున్నారు.
News October 24, 2025
డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలి: వనపర్తి ఎస్పీ

వనపర్తి జిల్లాలో డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణను అవలంబిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేలా కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా గట్టిగా గస్తీ నిర్వహించాలన్నారు.
News October 24, 2025
ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

భారత్‌తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఆఖరి 3 మ్యాచ్‌లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్‌వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్మ్యాన్, డ్వార్షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్‌లూ ఆడనున్నారు.


