News March 24, 2025
అచ్యుతాపురం జంక్షన్లో రోడ్డు విస్తరణకు ముహూర్తం ఫిక్స్

ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. ఆదివారం జరిగిన అచ్యుతాపురం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులమైన మనమందరం ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈనెల 31న అచ్యుతాపురం జంక్షన్‌లో రహదారి విస్తరణకు రాష్ట్రమంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News February 24, 2026
రాష్ట్రంలో రూ.549కోట్ల మోసం.. ఏం జరిగిందంటే?

TG: ఖమ్మంలో రూ.500కోట్ల సైబర్ స్కామ్ సంచలనంగా మారింది. సత్తుపల్లికి చెందిన వికాస్ చౌదరి, మరికొందరు ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్‌తో కలిసి రూ.549కోట్లకు పైగా కొల్లగొట్టారు. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్, బెట్టింగ్, గేమింగ్, క్రిప్టో కరెన్సీ పేరిట అమాయకులను మోసం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి పోలీసులు ఇప్పటికే 18 మందిని రిమాండ్‌కు పంపగా, కీలక నిందితుడు వికాస్ తాజాగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్‌లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్‌లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
News February 24, 2026
కామారెడ్డి జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలు

కామారెడ్డి జిల్లాలో మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాటా రూ.10, గోరుచిక్కుడు రూ. 50, బెండకాయ రూ. 50, దోసకాయ రూ. 40, బీరకాయ రూ. 60, ఆలుగడ్డ రూ. 30, క్యారెట్ రూ. 50, బీట్ రూట్ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, పాలకూర రూ. 40, వంకాయ రూ. 40, దొండకాయ రూ. 50, చిక్కుడుకాయ రూ. 50, ఉల్లిగడ్డ రూ. 30, ఎల్లిగడ్డ రూ. 200కు విక్రయిస్తున్నారు.


