News August 22, 2024

అచ్యుతాపురం ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది: మంత్రి కొల్లు

image

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామన్నారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Similar News

News December 3, 2025

కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

image

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.

News December 3, 2025

20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

image

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.