News February 7, 2025
అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయంలో బెల్లంపల్లి విద్యార్థికి సీటు

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో బెల్లంపల్లికి చెందిన ఆకునిరి రిషి చరణ్ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు. ఈ సందర్భంగా చరణ్ను బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సత్కరించారు. ఏసీపీ మాట్లాడుతూ.. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ జీ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం బెల్లంపల్లి పట్నానికి గర్వకారణం అన్నారు.
Similar News
News October 17, 2025
గద్వాల్: ఈనెల 22 నుంచి వ్యవసాయ పరికరాలు అందజేత

ఈనెల 22వ తేదీలోపు రైతులు దరఖాస్తు చేసుకుంటే రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని కేటీదొడ్డి మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్టీ, ఎస్సీలతోపాటు సన్న, చిన్నకారు రైతులకు 50%, జనరల్ కేటగిరిలో 40% రాయితీ ఉంటుందన్నారు. రొటోవేటర్, కల్టివేటర్, పవర్ స్ప్రేయర్లు, బ్రష్కట్టర్, పవర్ టిల్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్లతో పాటు రకరకాల పరికరాలను యాంత్రీకరణ పథకం ద్వారా అందజేస్తామన్నారు.
News October 17, 2025
ములుగు: నేడు వనం నుంచి జనంలోకి ఆశన్న!

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ మెంబర్ తక్కళ్లపల్లి వాసుదేవరావు@ఆశన్న జనజీవన స్రవంతిలోకి రానున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన ఆశన్న 30 ఏళ్లుగా అడవిబాట పట్టి, అంచలంచెలుగా ఎదిగారు. కేంద్ర సరెండర్ పాలసీలో భాగంగా 170 మందితో నేడు ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో ఆయుధాలు అప్పజెప్పి లొంగిపోనున్నారు. సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట వీరంతా లొంగిపోయి వనం నుంచి జనంలోకి రానున్నారు.
News October 17, 2025
కేయూలో లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ

కేయూ బాటనీ విభాగం అధిపతితో పాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు జారీ చేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆ విభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.