News March 11, 2025
అటవీ కళాశాలలో తేనెటీగల పెంపకంపై అవగాహన

ములుగు అటవీ కళాశాలలో రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అటవీ కళాశాలలో పరిశోధన సంస్థ సహకారంతో డాక్టర్ దీప ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేశారు. తేనెటీగల పెంపకం ప్రాసెసింగ్, మార్కెటింగ్, వ్యాధుల నివారణ చర్యలపై శిక్షణ అందించారు. డాక్టర్ పంకజ్ సింగ్, శాస్త్రవేత్త శ్రీకాంత్, డాక్టర్ శైలజ, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ సంజన పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.
News December 6, 2025
మెదక్: మరోసారి అవకాశం కల్పిస్తాం.. ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండో విడత, మూడో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి అయింది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తాం.. ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 6, 2025
ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్లో ఉంచారు.


