News March 11, 2025
అటవీ కళాశాలలో తేనెటీగల పెంపకంపై అవగాహన

ములుగు అటవీ కళాశాలలో రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అటవీ కళాశాలలో పరిశోధన సంస్థ సహకారంతో డాక్టర్ దీప ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేశారు. తేనెటీగల పెంపకం ప్రాసెసింగ్, మార్కెటింగ్, వ్యాధుల నివారణ చర్యలపై శిక్షణ అందించారు. డాక్టర్ పంకజ్ సింగ్, శాస్త్రవేత్త శ్రీకాంత్, డాక్టర్ శైలజ, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ సంజన పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
NGKL: వడదెబ్బతో ఎలక్ట్రీషియన్ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లిలో వడదెబ్బతో అంతటి అంజనేయులు అనే వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం రోజంతా ఎలక్ట్రీషియన్ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన, చన్నీటితో స్నానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 17, 2026
జగిత్యాల: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాలలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో 26-27 సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ముతా బాపు తెలిపారు. పుట్టగొడుగుల పెంపకం, సెల్‌ఫోన్ రిపేరింగ్, CCTV ఇన్‌స్టాలేషన్, గార్మెంట్ టైలరింగ్, బ్యూటీ ప్రాక్టీషనర్, ఫోటోగ్రఫీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. శిక్షణ ఉచితంగా ఉండడంతో పాటు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు.
News April 17, 2026
KNR: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్

KNR నుంచి తిరుపతికి రైలు ద్వారా వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వరుసగా గురువారం-ఆదివారం వరకు 4గు రోజుల పాటు KNR నుంచి తిరుపతికి రైలు నడువనంది. నాందేడ్ – ధర్మవరం(శుక్రవారం), నాందేడ్ – తిరుచానూరు (శనివారం) రైళ్లను రెగ్యులర్ చేశారు. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లో ఆగుతుంది. దీంతో పాటు KNR – TRTY SF Exp గురు, అది వారాల్లో నడుస్తుంది.


