News December 27, 2024
అటవీ సంరక్షణ కమిటీతో కలెక్టర్ చేతన్ సమీక్ష

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు హాని జరగకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో చెట్లు నాటే కార్యక్రమానికి అవసరయ్యే మొక్కలకు నర్సరీలు ఏర్పాటు చేసి పెంచాలని సూచించారు.
Similar News
News October 26, 2025
JNTUలో 28, 29, 30న ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 28, 29, 30న కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీంకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది బోధన సిబ్బంది పాల్గొననున్నారు. 28 మంది సీనియర్ ప్రొఫెసర్‌కు, 6 మంది ప్రొఫెసర్‌కు, 11 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతులకు దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు.
News October 26, 2025
అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News October 26, 2025
మోంతా ఎఫెక్ట్: అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో అనంతపురం జిల్లా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర వేళ 85002 92992 నంబరుకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తుఫాను పర్యవేక్షణ కోసం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వడరేవు వినయ్ చంద్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.


