News March 12, 2025
అట్టుడుకుతున్న ADB.. 40డిగ్రీల టెంపరేచర్

వేసవి ప్రారంభం ముందే ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతోంది. జిల్లాలో నిత్యం 39డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దయిన గాదిగూడ మండలంలో మంగళవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పక్క మండలమైన నార్నూర్‌లో 39డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 నుంచే వేడిమి పెరగడంతో బయటకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News February 25, 2026
ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.

కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.