News June 22, 2024
అట్లూరులో ఇరువర్గాల దాడి
అట్లూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్లో నివాసముండే నాగమునయ్య యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డయ్య తన వర్గంతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో నాగమునయ్య తలకి గాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Similar News
News November 15, 2024
కడప: బిజినెస్ వైపు మహిళా సంఘాలను ప్రోత్సహించాలి.!
కడప జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ-కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతో పాటు సంపూర్ణ సాధికారిత సాధించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో వివిధ రకాల పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. మహిళాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు.
News November 14, 2024
కడప: డిగ్రీ ఫలితాలు విడుదల
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ 7, 8, LLB సెమిస్టర్‌ల పరీక్షా ఫలితాలను కులసచివులు ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు, సహాయ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి విడుదల చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఎల్.ఎల్.బి, డిగ్రీ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు.
News November 14, 2024
నందలూరు: వర్రా, సజ్జల భార్గవ్‌పై మరో కేసు
నందలూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ. ఐటీ చట్టాల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వీరిపై 20 కేసులు నమోదయ్యాయి.