News August 27, 2024

అడవుల జిల్లాలో.. అందమైన దృశ్యం

image

అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందాలకు, ప్రకృతి రమణీయతకు కొదవలేదు. వర్ష కాలంలో ఆకుపచ్చని చీరను చుట్టినట్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన అడవితో అందాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని దట్టమైన చెట్ల మధ్యలో నుంచి నల్లటి తారురోడ్డు ఆదిలాబాద్ మీదుగా వెళ్లే 44 జాతీయ రహదారి విహంగ దృశ్యం కనువిందు చేస్తోంది.

Similar News

News September 21, 2024

ఉట్నూర్: నేడు మంత్రి సీతక్క రాక

image

ఈనెల 21న శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క రానున్నట్లు ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ తెలిపారు. మంత్రితో పాటు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గజేందర్, అదిలాబాద్ శ్రీనివాస్ రెడ్డి, సత్తు మల్లేశ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

News September 20, 2024

ADB: వీధికుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు

image

ఆదిలాబాద్‌లోని గాంధీనగర్‌లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. కాలనీలో శుక్రవారం ఆరుగురిపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 20, 2024

నిర్మల్ : సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలరోజుల ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు.