News January 30, 2025

అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను మార్యాదపూర్వకంగా కలిసిన సీపీ

image

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న ఆర్గనైజషన్, హోంగార్డ్స్ అడిషనల్ స్వాతి లక్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చాల అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అడిషనల్ డీసీపీని కలసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పీ భట్ ఉన్నారు

Similar News

News November 7, 2025

దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>దక్షిణ మధ్య రైల్వే<<>>లో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.

News November 7, 2025

వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

image

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.