News January 31, 2025
అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను మార్యాదపూర్వకంగా కలిసిన సీపీ

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న ఆర్గనైజషన్, హోంగార్డ్స్ అడిషనల్ స్వాతి లక్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చాల అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అడిషనల్ డీసీపీని కలసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పీ భట్ ఉన్నారు
Similar News
News November 18, 2025
జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు నివారణ

పంట విత్తిన 48గంటల్లో 200L నీటిలో అట్రాజిన్ 1kg పొడి మందు కలిపి పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఎకరాకు 200L నీటిలో పారాక్వాట్ 1L కలిపి విత్తే ముందు లేదా విత్తాక పిచికారీ చేయాలి. 20-25 రోజులకు వెడల్పాటి కలుపు మాత్రమే ఉంటే 200L నీటిలో 400 గ్రా. 2,4-D సోడియంసాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, ఆకుజాతి కలుపు ఉంటే ఎకరానికి 200L నీటిలో టెంబోట్రాయాన్ 34.4% 115ml కలిపి పిచికారీ చేయాలి.
News November 18, 2025
జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అవసరమయ్యే ఎరువులు

జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో మంచి దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన ఎరువులను వివిధ దశల్లో అందించాలి.
☛ పంట విత్తేటప్పుడు 50kg DAP+20kg MOP వేయాలి.
☛ పంట 20 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 40 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 60 రోజుల వయసులో 25kg యూరియా+15kg MOP ☛ ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జింక్ సల్ఫేట్ 20kgలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 18, 2025
పెనమలూరులో మావో సానుభూతిపరులు?

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. ఓ మహిళ సహా ఆరుగురు అనుమానితులను కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు గ్రూపులతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


