News January 30, 2025

అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను మార్యాదపూర్వకంగా కలిసిన సీపీ

image

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న ఆర్గనైజషన్, హోంగార్డ్స్ అడిషనల్ స్వాతి లక్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చాల అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అడిషనల్ డీసీపీని కలసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పీ భట్ ఉన్నారు

Similar News

News February 14, 2025

విశ్వక్‌సేన్ ‘లైలా’ రివ్యూ

image

బ్యూటీపార్లర్ నడుపుకునే హీరో ఓ కేసులో చిక్కుకోవడం, బయటపడేందుకు ఏం చేశాడనేదే ‘లైలా’ స్టోరీ. విశ్వక్‌సేన్ లేడీ గెటప్, అక్కడక్కడా కామెడీ సీన్లు కొంత వరకు ఫర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ సక్సెస్ కాలేకపోయారు. సెంటిమెంట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా మెప్పించలేకపోయాయి.
RATING: 1.75/5

News February 14, 2025

నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

image

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.

News February 14, 2025

సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

error: Content is protected !!