News June 18, 2024
అడుగంటిన నాగార్జున సాగర్

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది.
Similar News
News December 20, 2025
సోమవారం యథావిధిగా ‘ప్రజావాణి’: నల్గొండ కలెక్టర్

ఎన్నికల కోడ్ ముగియడంతో జిల్లాలో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుంచి యథావిధిగా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం విదితమే. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆమె తెలిపారు.
News December 20, 2025
మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
నల్గొండ: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

నల్గొండ ఎన్జీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహాత్మా గాంధీ వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డా.సముద్రాల ఉపేందర్‌తో కలిసి ఫలితాలను ప్రకటించారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.


