News March 26, 2025

అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

image

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.

Similar News

News December 7, 2025

10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

ప్రశాంతంగా ఎన్ఎంఎమ్ఎస్ పరీక్షలు: డీఈఓ

image

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును డీఈవో శామ్యూల్ పాల్ పరిశీలించారు. 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,960 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు.

News December 7, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ

image

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టారు.