News September 20, 2024
అడుసుమిల్లి మృతిపై జగన్ దిగ్భ్రాంతి

మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Similar News
News November 8, 2025
మచిలీపట్నం: కలెక్టరేట్లో భక్త కనకదాసు జయంతి

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.
News November 8, 2025
కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.


