News January 24, 2025
అడ్డగూడూరు: డ్రోన్ ద్వారా బ్లడ్ శాంపిల్స్

అడ్డగూడూరు మం. చౌల్లరామరంలో 12 మంది టీబీ అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా పంపినట్లు వైద్యాధికారి భరత్ రాథోడ్ తెలిపారు. మొదట రామన్నపేట ఏరియా ఆసుపత్రికి, అక్క నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు పంపించామన్నారు. డ్రోన్ ద్వారా చేర్చడంతో త్వరగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్థులకు సకాలంలో మందులు అందజేయవచ్చన్నారు.
Similar News
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
News December 10, 2025
ప.గో: పందెం కోళ్లకు బౌన్సర్ల సెక్యూరిటీ కావాలేమో..!

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.
News December 10, 2025
కామారెడ్డిలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 156 గ్రామాల్లో సర్పంచ్ పదవికి 727 మంది, 1084 వార్డులకు 3048 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. మూడో విడతో 168 పంచాయతీలకు గానూ 26 సర్పంచులు ఏకగ్రీవం కాగా, 142 సర్పంచ్ స్థానాలకు 442 మంది బరిలో ఉన్నారు.


