News November 9, 2024
అడ్డతీగల: ఏలేరు వాగులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

అడ్డతీగల మండలంలోని ఏలేరు వాగులో ఇసుక లోడు వేసేందుకు వెళ్లి ఏలేశ్వరం వాసులు నలుగురు శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇసుక వేసే గిన్నె నీటిలో పడిపోగా దానికోసం వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. అలా ఒకరికోసం మరొకరు వెళ్లి నలుగురు మిస్సైనట్లు స్థానికులు తెలిపారు. వారిలో జయబాబు, చిన్నా గొంతయ్యలు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా భూషణం, శ్రీనివాస్ ఆచూకీ తెలియలేదు.
Similar News
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.
News December 8, 2025
నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.


