News October 21, 2024
అడ్డతీగల: మహిళ ఊహాచిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు

అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం వద్ద ఏలేరు కాలువలో ఈ ఏడాది ఆగస్టు 17న ఓ మహిళ మృతదేహానికి చెందిన శరీర భాగల ఆధారంగా ఆమె నమూనా చిత్రాన్ని పోలీసులు ఆదివారం మీడియాకు విడుదల చేశారు. మరణించిన మహిళ వయస్సు 25-30 సంవత్సరాల ఉండవచ్చని తెలిపారు. ఊహా చిత్రంలోని పోలికలు ఉన్న మహిళ వివరాలు సెల్ నంబర్ 99590 66999కు తెలపాలని కోరారు.
Similar News
News October 14, 2025
దీపావళి నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు, భద్రతా చర్యల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టపాసుల హోల్సేల్ స్టాక్ షెడ్లు, తాత్కాలిక దుకాణాలకు వచ్చే దరఖాస్తులను రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.
News October 13, 2025
రాజమండ్రిలో యువ హీరో సందడి

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.