News April 3, 2025
అడ్డాకుల: అవసరాలకు డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కి చెందిన శివ(32) కూలీపనులు చేస్తూ జీవిస్తున్నారు. అవసరానికి తల్లితో అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి తల్లితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ సోలార్ గేట్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 12, 2025
MBNR: ఆ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో చిన్నచింతకుంటలో 39.7 డిగ్రీలు, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.6 డిగ్రీలు, నవాబుపేటలో 39.5 డిగ్రీలు, కోయిలకొండ (M) సిరివెంకటాపూర్‌లో 39.4 డిగ్రీలు, మిడ్జిల్ 39.3 డిగ్రీలు, కోయిలకొండ (M) పారుపల్లిలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News April 12, 2025
MBNR: రాత్రి వేళల్లో వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

రాత్రి వేళల్లో కూడ వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లాలోని PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో బయోమెట్రిక్ ఏర్పాటుచేసి హాజర్ ను పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పేద రోగులకు సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.