News February 13, 2025

అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 21, 2025

మానవపాడు: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

ఆరోగ్యం బాగోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడుకు చెందిన ఆనంద్ (26) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఆరోగ్యం బాగో లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తితో మానవపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News October 21, 2025

తిరుపతి జిల్లా స్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనే ఆసక్తిగల వారి నుంచి సెట్విన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జానపద నృత్యాలు, జానపద గీతాలు, జీవన నైపుణ్య విభాగం పోటీలు జరగనున్నాయి. ఈనెల 28న తిరుపతిలోని ఎమరాల్డ్స్ కాలేజీలో పోటీలు జరగనున్నాయి. ఇతర వివరాలకు 8341111687కు సంప్రదించగలరు.

News October 21, 2025

ఆదోనిలో MPTCల కిడ్నాప్ కలకలం

image

ఆదోనిలో MPTC కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య విజయలక్ష్మి తాలూకా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. MPPపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ MPTCలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనెల 22న జరిగే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. ఈయనతో పాటు మరో ముగ్గురు MPTCలను సైతం కిడ్నాప్ చేసినట్లు సమాచారం.