News March 29, 2024

అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు సమీపంలో వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు టవల్ మెడకు బిగించి హత్య చేసినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కడల సాయిలు (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 25, 2025

నిజామాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

image

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News January 25, 2025

బాల్కొండ: ఎన్నికల కోసమే రైతుబంధు: MLA

image

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. BRS ఆధ్వర్యంలో సాగు, సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, MLCలు యాదవరెడ్డి, కోటిరెడ్డి, మెండోరా మండలం బుస్సాపూర్‌లో రైతులతో శనివారం సమావేశమయ్యారు.

News January 25, 2025

NZB: వృద్ధులను అభినందించిన కలెక్టర్

image

ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఐడీ కార్డులను అందజేశారు.