News March 14, 2025
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు సంకల్పం: సంజయ్ కుమార్

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉపాధికల్పన, శిక్షణశాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ హనుమంతరావు, ఉపాధి కల్పనాధికారి సాహితి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.
News November 21, 2025
కామారెడ్డి: నిఖత్ జరీన్కు కవిత అభినందనలు

మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.
News November 21, 2025
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.


