News March 28, 2025
అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చా: భట్టి

తాను యాక్సిడెంటల్గా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని కాదని.. చాలా ఆలోచించి అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవన విధానం బాగుండాలని అశించానని.. మీలాగా దుర్బుద్ధితో వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
Similar News
News April 5, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.
News April 5, 2025
మధిర: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర-తొండల గోపురం రైల్వేస్టేషన్ మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన గడ్డం మహేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News April 5, 2025
మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి

ఖమ్మం: మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.