News April 5, 2025

అణగారిన వర్గాల హక్కులకై జగజ్జీవన్ రామ్ పోరాడారు: గవర్నర్

image

దేశ మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనకు ఘననివాళి అర్పించారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలు, అణగారిన వర్గాల హక్కులకై జగజ్జీవన్ రామ్ పోరాడారని గవర్నర్ వ్యాఖ్యానించారు. సామాజికన్యాయం, సమానత్వ సాధనకు జగజ్జీవన్ రామ్ అమితంగా కృషి చేశారని కొనియాడారు.

Similar News

News April 7, 2025

మహబూబ్‌నగర్: మీ ఆరోగ్యం.. జర భద్రం..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాలమూరు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, పొగతాగడం, ఒత్తిళ్లతో రోగాలు వస్తున్నాయన్నారు. మధుమేహం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, స్థూలకాయం, గుండెనొప్పి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
SHARE IT

News April 7, 2025

ఆ‘రేంజ్’లో ఊహించుకుంటే..

image

గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని IPL-2025లో SRHపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా ఆరెంజ్ ఆర్మీ ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా వాటిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారీ స్కోర్లు అటుంచి కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన చేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సమష్టిగా రాణిస్తే అంచనాలను అందుకోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News April 7, 2025

15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి: మంత్రి అనగాని

image

ప్రజలు వ్యవసాయ భూములు, స్థలాలు అమ్మడం లేదా కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15నిమిషాల్లో పూర్తి అవుతుందని రెవెన్యూ&రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్‌లో డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దీంతో సేవలు సులభతరమన్నారు.

error: Content is protected !!