News February 27, 2026

అతిథులకు నిలయం అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్!

image

వరంగల్ నిట్ ప్రాంగణంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్ అతిథులకు నిలయం. ప్రతిష్ఠాత్మకంగా జరిగే స్ప్రింగ్ స్ప్రీ, టెక్నోజియాన్, కాన్వకేషన్ లాంటి వేడుకలకు వచ్చే ముఖ్య అతిథులతో పాటు కేంద్ర మంత్రులు, సినీ నటులకు విడిది కల్పిస్తుంది. 2008 ఆగస్ట్ 18న అబ్దుల్ కలాం స్వయంగా ఈ అతిథి గృహాన్ని సందర్శించారు. ఆ రోజున ఆల్ట్రా మెగా హాస్టల్ భవనానికి పునాది వేసి, కంప్యూటర్ సెంటర్ ప్రారంభించారు.

Similar News

News April 15, 2026

మద్దతు ధర దక్కక గుంటూరు రైతుల ఆవేదన

image

జిల్లాలో దిగుబడులు బాగున్నా మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ 79,200 ఎకరాల్లో మొక్కజొన్న, 48,465 ఎకరాల్లో శనగ సాగైంది. మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,700కే అమ్ముతూ క్వింటాల్‌కు రూ.700 నష్టపోతున్నారు. కంది మద్దతు ధర రూ.8 వేలు కాగా రూ.7 వేలకే ఇస్తున్నారు. శనగ రైతులకూ ఎకరాకు రూ.5 వేల నుంచి 7 వేల దాకా నష్టం వస్తోంది. నిల్వ సదుపాయాలు లేక దళారులకు తక్కువకి అమ్ముతున్నారు.

News April 15, 2026

ములుగు: యాసంగి వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఇవే!

image

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాలను (FAQ) వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం మించరాదని, వ్యర్థ పదార్థాలు 1%, రంగు మారిన మొలకెత్తిన గింజలు 4%, పక్వానికి రాని గింజలు 3%, బెరుకు గింజలు 6% మించొద్దని సూచించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,369, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు.

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.