News February 18, 2025

అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

image

అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఉంటుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బాపట్ల పట్టణంలో ఉప్పరపాలెం గేట్ సమీపంలో ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఎస్పీ సోమవారం సందర్శించారు. మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ కౌన్సెలర్, లీగల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇస్తారన్నారు.

Similar News

News December 4, 2025

కడియం, ఎర్రబెల్లి స్వగ్రామం సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు..!

image

ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం అయిన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి(M) సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి 18 నామినేషన్లు దాఖలు కాగా, ముగ్గురు డబుల్ సెట్లు వేశారు. స్క్రూటినీలో వాటిని తొలగించగా 15 నామినేషన్లు ఫైనల్ అయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 8 మంది తమ అభ్యర్థిత్వాన్ని విత్ డ్రా చేసుకోగా, బరిలో ఏడుగురు మిగిలారు.

News December 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 4, 2025

The ‘Great’ హైదరాబాద్

image

విలీనంతో HYD దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. విలీనం అనంతరం బల్దియా స్థితి గతులను పరిశీలిస్తే..
GHMC విస్తీర్ణం: 2735 చదరపు కిలో మీటర్లు
జనాభా: దాదాపు కోటిన్నర
మేయర్, 149 మంది కార్పొరేటర్లు+300 డివిజన్లకు ఆస్కారం
కమిషనర్, 10 మంది అదనపు కమిషన్లర్లు
23 మంది MLAలు+కొత్తగా ఇద్దరు MLAలు?
6 జోన్‌లు+ఆరుగురు జోనల్ కమిషనర్లు
57 సర్కిళ్లు+57మంది డిప్యూటీ కమిషనర్లు