News February 18, 2025
అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఉంటుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బాపట్ల పట్టణంలో ఉప్పరపాలెం గేట్ సమీపంలో ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఎస్పీ సోమవారం సందర్శించారు. మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ కౌన్సెలర్, లీగల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇస్తారన్నారు.
Similar News
News April 17, 2026
శ్రీకాళహస్తిలో విషాదం

శ్రీకాళహస్తి (M) అరవకొత్తూరు గ్రామంలో ఈత కొట్టడానికి సమీపంలోని బావిలోకి వెళ్లి ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. అరవ కొత్తూరుకు చెందిన బాలకృష్ణ, సుకన్య దంపతుల కుమారుడు త్రిశూల్(10) స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. త్రిశూల్‌కు సమీప బంధువైన బీపీ అగ్రహారానికి చెందిన తరుణ్ రెడ్డి అదే బావిలో ఈతకు వెళ్లాడు. త్రిశూల్ మునిగిపోవడంతో కాపాడడానికి వెళ్లిన తరుణ్ కూడా మునిగిపోయి ఇద్దరు మృతి చెందారు.

అనకాపల్లి: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన మనస్తాపంతో వాడనరసాపురానికి చెందిన ఓ విద్యార్థిని (16) ఆత్మహత్యకు యత్నించింది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో నిరాశకు లోనై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.