News August 21, 2024
అత్తగారింటికి వచ్చి.. అల్లుడు ఆత్మహత్యాయత్నం
మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చి ఓ వ్యక్తి మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. హుటాహుటిన పోలీసుల సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుజురాబాద్‌కు చెందిన ఓంకార్(25) ఏడాది క్రితమే మణుగూరు యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మణుగూరు ఎస్సై మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు.
Similar News
News September 19, 2024
కూసుమంచి: పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల
పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
News September 19, 2024
పినపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2024
కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.